పరిమితిని మించి ప్రయాణం చేయవద్దు
On
విశ్వంభర, సూర్యాపేట: పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణం చేయవద్దు అని సూర్యపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణం కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ ఎస్ఐలు సాయిరాం మహేందర్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరడమే పోలీస్ శాఖ లక్ష్యమని ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కకూడదని చెప్పారు.



