ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా  చేవెళ్లలో ఉచిత వైద్య శిబిరం

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్బంగా  చేవెళ్లలో ఉచిత వైద్య శిబిరం

విశ్వంభర, చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైభవ్ రెడ్డి  సమన్వయం చేసి విజయవంతం చేశారు. ఈ వైద్య శిబిరంలో  అపోలో హాస్పిటల్స్ కు చెందిన మల్టీ స్పెషాలిటీ విభాగాల వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించారు. సాధారణ వైద్య పరీక్షలతో పాటు హృదయ, మధుమేహం, రక్తపోటు, ఎముకలు, కంటి తదితర విభాగాలలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. సుమారు 400 మంది ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్య సేవలు పొందారు. వీరిలో 20 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించి, వారికి ఉచిత నేత్ర చికిత్సలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి   జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags: