ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే బస్సులు సీజ్
- షాద్ నగర్ ఆర్టివో స్వప్న వెల్లడి
విశ్వంభర, షాద్ నగర్: విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, విద్యాసంస్థల యాజమాన్యాలు స్కూల్ బస్సులను ఫిట్‌నెస్ చేయించుకోవాలని షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్న సూచించారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పై మాట్లాడుతూ, సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, డ్రైవర్ల లైసెన్సులు లేని వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు, నిబంధనలు పాటించని పలు బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి స్కూల్ బస్సును భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తారని తెలిపారు.ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బస్సుల కండిషన్, బ్రేకులు,టైర్ల పనితీరు,అగ్నిమాపక పరికరాలు,అత్యవసర ద్వారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.60 ఏళ్లు దాటిన డ్రైవర్లు ఉండకూడదన్నారు.మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలన కచ్చితంగా ఉంటుందన్నారు