ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థులు కంప్యూటర్ బహుకరణ

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, శోభనాద్రిపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 2007-08 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ బహుకరణ చేయడం జరిగింది. వారు చదువుకున్న పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది యొక్క పని తీరును గమనిస్తున్న గ్రామస్థులు, యువకులు పాఠశాల అవసరాలను తీర్చడానికి ముందుకు వస్తున్నారు. పాఠశాల సిబ్బంది బాగా పనిచేస్తే గ్రామస్థుల సహకారం అందుతుందని తెలుపడానికి చక్కని ఉదాహరణ శోభనాద్రిపురంలోని ప్రభుత్వ పాఠశాల. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని గతంలో చదివిన అన్ని బ్యాచులకు సంబంధించిన విద్యార్థులు పాఠశాలకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల 2007-08 విద్యా సంవత్సరంలో 7వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gift-of-computer-to-former-students-of-government-school/article-19470

Tags: