పంచాయితీ భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదు
On
- సర్పంచ్
విశ్వంభర, గుండాల: గుండాల మండలం నూనె గూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని గ్రామ సర్పంచ్ మధ్య పురం కొండమ్మ పరశురాములు అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించకపోవడం పంచాయతీ సభ్యులుగా ఉంటూ అభివృద్ధికి ఆటంకం కలిగించడం సరికాదని అన్నారు. గ్రామంలో చెరువు సికం లో శ్మశాన వాటిక నిర్మాణం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉప సర్పంచ్ అండేo ప్రశాంత్ రెడ్డి కప్పర కనకా రెడ్డి అండేo లక్ష్మారెడ్డి జిట్టే సత్తయ్య రాజశేఖర్ రెడ్డి బుసిగంపుల కిష్టయ్య మహేష్ యువకులు పాల్గొన్నారు



