దోషులను కఠినంగా శిక్షించాలి

దోషులను కఠినంగా శిక్షించాలి

విశ్వంభర, ఆత్మకూర: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా, రజక కులానికి చెందిన రెండు నెలల పసిపాప బేబీ మౌనికను కాలుతో తన్ని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రజక సహకార సంఘం అధ్యక్షుడు ఎలిమినేటి మురళీకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రజక సహకార సంఘం భవనంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రజక సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి బుచ్చయ్య మాట్లాడుతూ, పసిపాప మృతికి కారకులైన ఏ పార్టీకి చెందిన వారైనా సరే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని హత్య నేరం కింద కేసులు నమోదు చేసి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి దోషులను శిక్షించడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పైల్ల ప్రశాంత్, మాజీ అధ్యక్షులు వెలిమెకన్నె సత్యనారాయణ,రజక వృత్తిదారుల సంఘం జిల్లా సలహాదారులు ఎలిమినేటి నగేష్,సీనియర్ నాయకులు ఎలిమినేటి ఎలంధర్,రజక సంఘం నాయకులు స్వామి, వెంకటేష్, శ్రీను, యాదయ్య, శంకరయ్య, కనకయ్య,కిష్టయ్య, మచ్చగిరి, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags: