ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
On
విశ్వంభర, మహబూబాబాద్ : మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రామచంద్రపురం కాలనీలో గురువారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణంకు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ శంకుస్థాపన చేశారు . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీవాసులు సుఖసంతోషాలతోనూ ఆనందంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. వార్డ్ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపనలో పూజారులు నవధాన్యాలు వేసి పూజా కార్యక్రమాలు చేశారు . ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత, దేవాలయ చైర్మన్ సోమ రాంబాబు , గౌరవ అధ్యక్షులు బోళ్ల మల్లారెడ్డి , వార్డు కౌన్సిలర్లు , వార్డు ప్రజలు పాల్గొన్నారు .



