ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల శ్రీహరి డిమాండ్ చేశారు. హైదరాబాదులోని కార్యాలయం లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న అనేక కుటుంబాలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఉద్యమకారులకు బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని, 250 గజాల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానాలు ఆమోదించి, ప్రభుత్వానికి విన్నపం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ముత్యాల జంగయ్య, అబ్దుల్ రెహమాన్, డప్పు వినోద్ కుమార్, దాసరి మమత, సి మాధవి పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-problems-of-the-activists-should-be-resolved-immediately/article-16527

Tags: