మంచినీటిలో డ్రైనేజీ కాలుష్యం ఆరికట్టాలి
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : హైదరాబాదు బాగ్‌లింగంపల్లి ఎల్ఐజి క్వార్టర్స్‌లో మంచినీటిలో డ్రైనేజీ నీరు కలిసివస్తుండటంపై హైదరాబాదు సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జీఎం శ్రీధర్, డిజీఎం విష్ణువర్ధన్‌కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. మార్చి 1 నుంచి మంచినీటిలో డ్రైనేజీ కలిసివస్తుండటంతో దుర్వాసన ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సంగీత, రమేష్, శంకరయ్య, నగేష్, పాల్, కృష్ణ పాల్గొన్నారు.