రేపటి నుంచే ప్రత్యేక స్కూల్ బస్సులు ​

రేపటి నుంచే ప్రత్యేక స్కూల్ బస్సులు ​

  • విద్యార్థుల వేళలకు అనుగుణంగా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలి 
  • ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశం

 విశ్వంభర, జిహెచ్ ఎం సి: వేసవి సెలవుల అనంతరం రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో  విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ లఅధికారులను ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు.  ​రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.

🕒 15 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-school-buses-from-tomorrow/article-16648

Tags: