న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి
విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, సామాజిక న్యాయ ఉద్యమానికి న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఏఐసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీనియర్ న్యాయవాది వై. రవికుమార్ యాదవ్, నాగ సీతారాములు అధ్యక్షతన హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్‌గా రెండవసారి విజయం సాధించిన చిలకని వెంకట్ యాదవ్‌ను సన్మానిస్తూ ఆయన మాట్లాడారు. వెంకట్ యాదవ్ విజయంలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలుపుతూ, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత చిలకని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, తనకు సహకరించిన న్యాయవాదులు, పెద్దలు, వివిధ రంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి రెండోసారి బార్ కౌన్సిల్ మెంబర్‌గా గెలవడం విశేషమని, పేదలకు న్యాయ సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ వర్రె వెంకటేశ్వర్లు, చింతల రవీంద్రనాథ్, ముక్కామల వెంకన్న, ఆర్ లక్ష్మణ్ యాదవ్, న్యాయవాది ఏ అచ్యుత, నోముల సైదులు, నోముల శేషు, దాసరి శ్రీనివాస్, శివ, శ్రీహరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.