రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా దుబాకుల

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శిగా దుబాకుల

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గా ఖమ్మానికి చెందిన దుబాకుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఏకగ్రీవంగా ఆయనను ఎంపిక చేసినట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. సంఘ బలోపేతం, పెన్షనర్ల సమస్యల పరిష్కారం, ఇహెచ్ఎస్ అమలు, పిఆర్సి సంబంధిత అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సంఘ నేతలు, సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: