రామన్నపేటలో విత్తన మేళా
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో రామన్నపేట-వలిగొండ వ్యవసాయ మర్కెట్ కమిటీ వైస్-చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాల వినియోగం, పంటల సాగులో ఆధునిక విధానాలు, ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతు వేదికల ద్వారా అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రాయితీలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగుల రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు జమీరొద్దన్, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.