గౌరవ వేతనం లేక సర్వేయర్ల ఆందోళన 

గౌరవ వేతనం లేక సర్వేయర్ల ఆందోళన 

విశ్వంభర, నారాయణగూడ :  2025 నుంచి ఇప్పటివరకు లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నామ ని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వే సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నగర రమేష్ అన్నారు. హైదరాబాదు నారాయణగూడలోని సర్వే భవన్ వద్ద సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ధర్నాలో ఆయన మాట్లాడారు. సర్వేయర్లకు పనులు కల్పించకపోవడంతో ఆదాయం లేక జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సర్వేయర్లకు భద్రత కల్పించడం అత్యవసరమని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల లైసెన్స్ విధానం సర్వేయర్లకు నష్టదాయకమని పేర్కొంటూ, దీనిని రద్దు చేసి 60 సంవత్సరాల జీవితకాల లైసెన్స్ అమలు చేయాలని కోరారు. ప్రతి రెండు రెవెన్యూ గ్రామాలకు ఒక సర్వేయర్‌ను నియమిస్తే రైతుల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని వివరించారు. సర్వేయర్లను దీర్ఘకాలంగా వేచి పెట్టడం బాధాకరమని, వెంటనే పనిలోకి తీసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో: వర్కింగ్ ప్రెసిడెంట్ రంగు శివ కన్వీనర్ సందీప్ బాలకృష్ణ నరేష్ సతీష్ దామని మణి సరస్వతి అరుణ పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/honorarium-or-concern-of-surveyors/article-17068

Tags: