పట్టణ పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి
- చైర్‌పర్సన్ దండి లక్ష్మి
విశ్వంభర, హుస్నాబాద్ :హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 3, 5, 8, 17, 19 వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్డు సభల అనంతరం పట్టణంలో రోడ్ల శుభ్రత, డ్రైనేజీల పరిశుభ్రత, మొక్కల నాటకం, దోమల నివారణ స్ప్రేయింగ్, బ్లీచింగ్ చల్లడం వంటి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పట్టణ పరిశుభ్రతలోనూ భాగస్వాములు కావాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందించాలని, వార్డుల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 19వ వార్డులో పారిశుధ్య కార్మికుడు ప్రభాకర్ చెత్త విభజనపై వినూత్న అవగాహన ప్రదర్శన నిర్వహించారు. తడి చెత్త డబ్బాను తలపై ధరించి “తడి చెత్త దేవుడు ఇచ్చిన వరం” అంటూ సేంద్రియ ఎరువు తయారీ ప్రయోజనాలను వివరించారు. అలాగే పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలు, ఇతర చెత్త కోసం ఉపయోగించే రంగురంగుల డబ్బాలను చేతులకు ధరించి చెత్త వర్గీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని కూడా వినూత్నంగా వివరించి అందరి ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.మల్లికార్జున్, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు కొండ రజిత, బొలిశెట్టి రాజు, కాశబోయిన సరిత, గాదెపాక రవీందర్, బత్తుల స్వరూప, మున్సిపల్ అధికారులు, జవాన్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.