కేసముద్రంలో  డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ కి  ఘన నివాళులు

విశ్వంభర,  కేసముద్రం: మహోన్నత దేశభక్తులు, జనసంఘ్ స్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ  బలిదాన్ దివాస్ (వర్ధంతి) సందర్భంగా కేసముద్రం మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ  కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఉప్పునుతల రమేష్  నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఐక్యత, అఖండత కోసం ఆయన చేసిన త్యాగాలను మరియు దేశానికి ఆయన అందించిన సేవలను నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కన్వీనర్ బోగోజు నాగేశ్వర చారి, మంగిశెట్టి నాగయ్య, ముదిరెడ్డి మురళి, పోలేపల్లి సంపత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పరకాల మురళి, బానోత్ రాము, బానోత్ సంపత్, వల్లందాస్ నగేష్,  దేశబోయిన కుమార్, గుగులోత్ శ్రీనాథ్, కొండ్రెడ్డి వీరారెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు, బి ఎల్ ఎ-2 లు, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-dr-shyam-prasad-mukherjee-in-kesamudram/article-17082

Tags: