అంబర్‌పేటలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుల నియామకం

విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలోని ఎనిమిది మున్సిపల్ డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను నియమిస్తూ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ జిల్లా పరిధిలో ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. బర్కత్‌పుర డివిజన్‌కు కైరంకొండ శ్రీనివాస్ శ్రీకాంత్, కాచిగూడకు పగిడి భరత్, గోల్నాకకు మహమ్మద్ మతిన్, పటేల్‌నగర్‌కు బి. రాఘవేంద్ర, అంబర్‌పేటకు షేక్ సమద్, బాగ్ అంబర్‌పేటకు రావుల సుధాకర్, తిలక్‌నగర్‌కు మన్నే రాకేష్, నల్లకుంటకు ప్రవీణ్ యాదవ్‌లను అధ్యక్షులుగా నియమించారు. నియమితులైన డివిజన్ అధ్యక్షులు హైదరాబాదు అంబర్‌పేటలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే రోహిత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో: కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ యాదవ్ నారాయణస్వామి శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/appointment-of-congress-division-presidents-in-amberpet/article-17072

Tags: