హుస్నాబాద్‌లో విత్తన మేళా ప్రారంభం

హుస్నాబాద్‌లో విత్తన మేళా ప్రారంభం

  •  జూన్ 30 వరకు రైతులకు ప్రత్యేక అవకాశం

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 23 జూన్ నుండి 30 జూన్ 2026 వరకు నిర్వహించనున్న ప్రత్యేక విత్తన మేళాను హుస్నాబాద్ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని డివిజనల్ వ్యవసాయ అధికారి ఎల్. వీణారెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ  ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ విత్తన మేళా హుస్నాబాద్, మీర్జాపూర్ రైతు వేదికలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా కొనసాగనుంది. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. సన్న రకాల వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రత్యేక బోనస్ అందిస్తున్నందునే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయాలని,వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన సన్న రకాల వరి విత్తనాలను సాగు చేసి ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జి. వెంకటశివరాం, కే. విజయ్, రైతు నాయకులు గుర్రాల సంజీవరెడ్డి, గంగం సుధాకర్, జొన్నగడ్డల రవీందర్, విత్తన డీలర్లు ,పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/seed-fair-begins-in-husnabad/article-17084

Tags: