రామవరం గ్రామ భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు
విశ్వంభర, అక్కన్నపేట: అక్కన్నపేట మండలం రామవరం గ్రామ ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బొమ్మ శ్రీశైలం ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో గ్రామ భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మ శ్రీశైలం మాట్లాడుతూ, గ్రామంలో శాంతి భద్రతలను కాపాడడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వాటిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల భద్రత కూడా తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. గ్రామంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రతా చర్యలను మెరుగుపరచడం ద్వారా ప్రజల్లో భరోసా పెరుగుతుందని ఆయన తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనులను పరిశీలించారు. గ్రామ ప్రజలు ఈ చర్యను స్వాగతిస్తూ సర్పంచ్ బొమ్మ శ్రీశైలంకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రాము, ఉపసర్పంచ్ లింగాల కనకయ్య, వార్డు సభ్యులు సురేష్, పంగ రాకేష్, బుర్ర అఖిల్, రవితేజ, సురేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.