కల్వల పాఠశాలల ఆకస్మిక తనిఖీ
- విద్యా ప్రమాణాలపై డీఈఓ ప్రత్యేక దృష్టి
విశ్వంభర,కల్వల: మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ. సత్యనారాయణమూర్తి మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల పనితీరు, బోధనా విధానాన్ని స్వయంగా తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య కూర్చొని పరిశీలించారు. విద్యార్థులతో ఇంగ్లీషులో సంభాషిస్తూ ప్రశ్నలు అడిగి వారి ప్రతిభ, అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. చిన్నారులకు ప్రాథమిక విద్యను సులభంగా అర్థమయ్యే విధంగా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈఓ ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించి, పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సన్నాహకంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు. తదుపరి డీఈఓతో పాటు కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవరెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ డైరెక్టర్ రావుల మురళి, అంబటి మహేందర్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు ఆర్. ఏకాంబరం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, వి. నాగేందర్, బేతి సత్యనారాయణ, మార్గం శ్రీనివాస్, రాగి బిక్షపతి, కే. పార్వతి,కే. రాములు, శౌ రెడ్డి,రాము, లింగయ్య,సీఆర్పీ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.