రైతు వేదికలో విత్తన మేళా 

రైతు వేదికలో విత్తన మేళా 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ రైతు వేదికలో మంగళవారం ఉదయం నిర్వహించిన రైతు విత్తన మేళ కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు సలహాలు తెలియచేసిన గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా పలు రకాల వరి విత్తనాలు, కూరగాయల విత్తనాలు, ఇతర వ్యవసాయ మందులను పరిశీలించడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన విత్తనాల్ని కొనుగోలు చేయాలని వారు సూచించిన విధంగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సి హెచ్ భాస్కర చారి,మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి పల్లవి, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/seed-fair-at-rythu-vedika/article-17078

Tags: