మాతా, శిశు మరణాలు అరికట్టాలి
- ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలి
- డీఎంహెచ్‌వో డాక్టర్ కె. కృష్ణ
విశ్వంభర, నాగర్‌కర్నూల్: మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ సూచించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మాతా, శిశు సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గర్భిణులను 12 వారాల లోపే నమోదు చేయాలని, ముఖ్యంగా రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి గర్భవతికి ప్రసవ ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. గర్భిణుల వైద్య పరీక్షల కోసం 102 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గర్భిణి స్త్రీ వైద్య నిపుణులచే తప్పనిసరిగా పరీక్షించబడేలా చూడాలని ఆదేశించారు. మాతా-శిశు సంరక్షణ కార్డులో పరీక్షలు, ఇతర వివరాలను పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. జూన్ 28న నిర్వహించనున్న ఉధృత పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి అవసరమైన వ్యాక్సిన్ క్యారియర్లు, ఐస్ ప్యాక్‌లు సిద్ధం చేసుకోవాలని, ప్రతి వ్యాక్సినేటర్‌కు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల సహకారంతో ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్ కె. కృష్ణ హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవికుమార్, డాక్టర్ రఫిక్, డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రదీప్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ భరత్‌కుమార్ రెడ్డి, డాక్టర్ భీమానాయక్, డాక్టర్ తారాసింగ్, డీపీఓ రేనయ్య, డీడీఎం సందీప్, ఏపీఓలు బాలస్వామి, కొట్ర నిరంజన్, విజయ్‌కుమార్, విజయ్, ఆరిఫ్, శివకుమార్‌తో పాటు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షణ సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.