విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు 

విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన సదస్సు 

విశ్వంభర, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ మూడో డివిజన్ ఆరేపల్లి లో ఉన్న మహాత్మ జ్యోతి బా పూలే ఇంటర్ విద్యార్థినులకు డ్రగ్స్ పై ఏనుమాముల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బృందం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ సురేష్ మాట్లాడుతూ విద్యార్థినీలు, చెడు సావాసాలకు, చెడు తిరుగుళ్ళు, మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలు, వంటి వాటికి అలవాటు పడకూడదని ,వాటిని దరిచేరనీయకుండా ఉండాలని,తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా ఉండాలని, అన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు  అధర్య పడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అని తెలిపారు. మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్  కు ప్రిపేర్ అవ్వాలని మంచి ర్యాంకులు సాధించాలని అందరూ గర్వపడే విధంగా ఉండాలని అన్నారు. కాలేజీలో ఉన్న అధ్యాపకులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధ వహించి వారి భవిష్యత్తు బాగుండే విధంగా తీర్చి దిద్దుతారని అన్నారు. ఎలాంటి సమయంలో అయినా ఆపద వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఫోన్ చేయగలరని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ ఐ సదయ్య, పోలీస్ సిబ్బంది, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థిని లు, తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/drug-awareness-conference-for-students/article-17070

Tags: