మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగ్ లింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు నవీన్ నాయక్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి లంబాడి తండ బస్తీలో చీరలు అందజేసి ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం కింద మహిళలకు చీరల పంపిణీ చేయడం ద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించడమే లక్ష్యమని వివరించారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి జరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో: నాగభూషణం బబ్లూ కుమార్ గోపాల్ పాల్గొన్నారు.