దీపావళి – అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపే పండుగ.

-ఓదెల. చంద్రమౌళి 

దీపావళి – అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపే పండుగ.

విశ్వంభర, హనుమకొండ జిల్లా:- దీపావళి భారతదేశంలో హిందువులే కాకుండా సిక్కులు  ఇతర వేర్వేరు సమాజాల వారు కూడా తమ సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి పండుగ వెనుక చాలా విజ్ఞానం దాగి ఉంటుంది. అదే విధంగా, దీపావళి పండుగ వెనుక కూడా అనేక విజయ రహస్యాలు, ప్రకృతిని పరిరక్షించే అంశాలు దాగి ఉన్నాయి. దీపం చీకటిని తొలగిస్తుంది -దీపం మనసులో కోపాన్ని తొలగిస్తుంది- దీపం ఆరోగ్యం ప్రసారం చేస్తుంది -
దీపం ప్రకృతిని పరిరక్షిస్తుంది- దీపం సమాజంలో ప్రేమను నింపుతుంది- దీపం విజ్ఞానాన్ని అందిస్తుంది- దీపం హృదయాల్లో ఆశను వెలిగిస్తుంది-
దీపం ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది- దీపం ప్రతి మూలలో శాంతిని పంచుతుంది- దీపం భవిష్యత్తుకు ఆశ వెలిగిస్తుంది-
 
  • దీపావళి జరుపుకునే సందర్భాలు.సాధారణంగా అశ్వయుజమాస కృష్ణపక్షం అమావాస్య రోజున జరుపుకుంటారు.  శ్రీకృష్ణుడు నరకాసురుని వధించి సమాజంలో చెడును తొలగించిన సందర్భాన్ని గుర్తుచేస్తూ రామాయణంలో రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగి రాజ్యానికి వచ్చిన సందర్భంలో పాండవులు వనవాసం పూర్తయిన సందర్భంలో కూడా దీపావళిని జరుపుతారు
  •  దీపం, ప్రకృతిమనం ఉపయోగించే దీపం ప్రకృతికి సంబంధించిన వైజ్ఞానిక ప్రయోజనాలు కలిగివుంటుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా ప్రకృతిలోని చెడు కారక శక్తులను తొలగించగలమని, అలాగే సీజనల్ వ్యాధుల నుండి మనలను రక్షించగలదని నమ్మకం ఉంది. చలి ప్రారంభమయ్యే రోజుల్లో దీపం మనకు వెచ్చదనాన్ని అందిస్తుంది. దీపం మానసిక ప్రశాంతత, కోపం నియంత్రణ, ఆరోగ్యం మరియు సాన్నిహిత్య శాంతిని అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ . మన ఆచారాలను సరైన విధంగా పాటిస్తే, దీపావళి పండుగ పర్యావరణాన్ని పరిరక్షించడంలో సహాయపడుతుంది.
,
 

Tags: