ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి 

ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి 

 విశ్వంభర, మిర్యాలగూడ:  మిర్యాలగూడలో సోమవారం అల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం  కమిటీ  ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీశంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ,మున్సిపల్ ఛైర్మన్ చిలుకూరి సుధా బాలు,  వైస్ ఛైర్మన్  గుడిపాటి శిరీష నవీన్, గిరిజన నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  మిర్యాలగూడ ఎంపీడీవో  కార్యాలయం నుండి మొదలై బంజారా భవన్ వరకు సేవాలాల్ మహారాజ్ స్వామి ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంజారా భవన్లో గిరిజన సంప్రదాయ బద్దంగా భోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజల అనంతరం  మినీ రవీంద్ర భారతిలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే బీఎల్ఆర్  మాట్లాడుతూ  గోర్ బంజారా సమాజానికి నిజమైన దైవం, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు సంత్ సేవాలాల్ మహారాజ్..  18వ శతాబ్దంలోనే బంజారాల సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎనలేని కృషి చేశా  రన్నారు  కర్ణాటకలో జన్మించిన సేవాలాల్, అహింస, శాకాహారం, ధర్మం, క్రమశిక్షణ పాటించాలని బోధించారు. మతమార్పిడులను, మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. సేవాలాల్ మహారాజ్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఒక గొప్ప దార్శనికుడు, భవిష్యత్తులో వాహనాల వాడకం (ఎడ్లు లేని బండ్లు), నీటి ఎద్దడి గురించి ఆయన ఆనాడే చెప్పారని, .అంత ముందు చూపు కలిగిన మహా జ్ఞాని  అని అన్నారు.  సేవాలాల్ మహారాజ్ మనకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించారు.. ఆయన తండాల అభివృద్ధికి, విద్యకు, స్త్రీల గౌరవానికి ఎంతో ప్రాధాన్యత ఐచ్చారు అని అన్నారు. "సేవాలాల్ మహారాజ్ చూపిన అహింసా మార్గంలో నడుస్తూ, బంజారా సమాజం విద్యావంతంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంతో ముందడుగు వేయాలి. ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని  అన్నారు. ప్రజా ప్రభుత్వం లో గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. అనంతరం గిరిజన నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గం గిరిజన నాయకులు, గిరిజన ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: