నేటి నుండి 31 వరకు వైద్య శిబిరాలు 

 విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో నేటి  నుండి ఈ నెల  31వరకు వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పెండెం వెంకట రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాలందు మహిళల వైద్య నిపుణులు,  (గైనకాలజిస్ట్)పిల్లల వైద్య నిపుణులు,జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్ నిపుణులు,కంటి వైద్య నిపుణులు, పంటి వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి కి అవసమైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు.ఈ శిబిరాలు మన జిల్లా యందు గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేయటం జరుగుతుందనీ,ఈ శిబిరాలకు మహిళలు, వయోవృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధ పడు వారు, కంటి చూపు సమస్యలు ఉన్నవారు, పంటి నొప్పితో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఆవాసాల దగ్గరగా ఉన్న శిబిరాలకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్నారు.ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, పారామెడికల్ సూపర్వైజరీ అధికారులు సిబ్బంది,ఆరోగ్య కార్యకర్తలు,  ఆశాలు తమకు కేటాయించిన ప్రాంతాల నుంచి చికిత్స అవసరమైన వారిని శిబిరాలలో చికిత్స పొందేలా చూడాలని ఆదేశించారు.

Tags: