గౌరవెల్లిపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం మానుకోవాలి
- అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్
విశ్వంభర, అక్కన్నపేట : గౌరవెల్లి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కాంగ్రెస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ గౌడ్ పత్రికా ప్రకటనలో తెలిపారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టును పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ పూర్తి చేసిన ప్రభుత్వం గౌరవెల్లిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని బుర్ర ప్రభాకర్ గౌడ్ కోరారు