కీర్తన గోల్డ్ ఫైనల్స్ లో భారీ గోల్డ్ స్కాం
కీర్తన గోల్డ్ ఫైనల్స్ లో భారీ గోల్డ్ స్కాం
విశ్వంభర, చెన్నై కొత్త పల్లి : కీర్తన గోల్డ్ ఫైనల్స్ లో భారీ గోల్డ్ స్కాం వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి కీర్తన గోల్డ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్నటువంటి అనుదీప్, నిఖిల్, దినేష్ ,కృష్ణ ప్రసాద్ అరుణ్ కుమార్, వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించి బాధితులు పెట్టిన గోల్డ్ ను అక్కడ నుంచి ఇతర బ్యాంకులకు తరలించి భారీగా స్కామ్ చేశారంటూ బాధితులు ఇచ్చిన సమాచారం.ఈ స్కాముకు ఎస్సై సత్యనారాయణ కూడా సహకరించినట్టుగా బాధితులు తెలపడం జరిగింది. ఐదు నెలలుగా నుంచి బంగారం కి డబ్బులు కట్టి బంగారం కోసం కీర్తన ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగలేదన్నారు.ఒకరి బంగారం మరొకరిపై లోన్ పెట్టి అలా 40 మంది బాధితుల బంగారును దాదాపు 50 తులాలకు పైగా స్కామ్ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై సత్యసాయి జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ లో కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ను తిరిగి చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి పంపించడంతో ఎస్సై సత్యనారాయణ బాధితులను పిలిపించి తనలాటికి పని చెబుతున్నట్లుగా బాధితులు పేర్కొన్నారు. కీర్తన గోల్డ్ ఫైనాన్స్ పై ఎవరన్నా కంప్లైంట్ చేయడానికి వస్తే వారిని వాంటెడ్ చేసి కొడుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై విసుకు చెందిన బాధ్యతలు చివరికి అదే గోల్డ్ ఫైనాన్స్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి మాకు న్యాయం చేయాలంటూ బాధితులు వాపోయారు.


