‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ
విశ్వంభర, హైదరాబాదు : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో తెలంగాణను రోల్ మోడల్‌గా నిలపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాదు ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన “తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026” కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలీసింగ్‌లో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్ ఆధారంగా ‘ట్రిపుల్ టీ’ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాలు డిజిటల్ రూపంలో పెరుగుతున్నాయని, డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఫిషింగ్ స్కామ్‌లు పెద్ద సవాల్‌గా మారాయని పేర్కొన్నారు. డేటా అనలిటిక్స్, ఏఐ సాయంతో నేరాలు జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, శిఖా గోయల్, అభిలాష భిష్త్, హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



