మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
విశ్వంభర, చింతపల్లి: 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని చింతపల్లి ఎస్సై ముత్యాల రామ్మూర్తి కల్పించారు. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు గురించి హితగు పలికారు యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచన కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు. ఒక వ్యక్తి డ్రగ్స్ కు అలవాటు పడితే మానిపించడం చాలా కష్టమని లక్స్ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని మత్తులో నిద్రిస్తాడని క్రూరమైన ఆలోచన కలిగి ఉండాలి తెలియజేశారు విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ట్రక్స్ వినియోగించినట్లు అనుమానం వచ్చినా విక్రయిస్తున్నట్టు తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. అప్పుడు మాత్రమే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని ఎస్సై రామ్మూర్తి తెలిపారు.



