మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం 

మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం 

విశ్వంభర, గుండాల : గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో సోమవారం మెగా ఆరోగ్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు విస్తృతంగా వైద్య సేవలు అందించగా, సుమారు 70 మంది లబ్ధి పొందారు. ఈ సందర్భంగా 15 మంది రక్త పరీక్షలు చేయించుకోగా, మొత్తం 27 రక్త నమూనాలు సేకరించబడినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రజాపాలన .. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంటువ్యాధి కాని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా రక్తపోటు, చక్కెర పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలి పద్మ పాల్గొని, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్య సిబ్బంది కూడా శిబిరం నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బందిని మండల వైద్యాధికారి డా. ప్రవీణ్ కుమార్ అభినందించారు.

Tags: