నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు

నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు

   విశ్వంభర, రామన్నపేట: నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉన్నందున రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని రావన్నపేట నియోజకవర్గ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ కోరారు. బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనుకున్నట్లుగానే రామన్నపేటను నియోజకవర్గంగా ప్రకటించుటకు అన్ని అవకాశాలు ఉన్నందున, నియోజవర్గ సాధన కోసం రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఇకనుండి నియోజకవర్గం ఏర్పడేంత వరకు నిరంతర కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. రామన్నపేటకు నియోజకవర్గంగా ఉండటానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, అన్ని రకాల ఆఫీసులు ఉన్న, భౌగోళికంగా పాలించడానికి అన్ని వసతులు ఉన్న రామన్నపేటను పునర్విభజనలో భాగంగా నియోజకవర్గంగా ఏర్పాటు చేయించడానికి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ సొంత అజెండాగా ముందుకు రావాలని కోరారు. దాని మూలంగా రామన్నపేట అభివృద్ధి  చెందడానికి అన్ని అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. నియోజవర్గం సాధించే వరకు ఇకనుండి ప్రణాళిక ప్రకారం రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు కలిసి మెమోరండాలు  ఇవ్వడం జరుగుతుందని, సదస్సులను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి నియోజక వర్గం ఏర్పడే దిశగా ముందుకు సాగుతుందని తెలియజేశారు.

Tags: