20 నుంచి శిక్షణ శిబిరాలు :  షేక్ హాజీ బాబా

20 నుంచి శిక్షణ శిబిరాలు :  షేక్ హాజీ బాబా

విశ్వంభర, మహేశ్వరం :  ఈనెల  20  నుండి ఉచిత శిక్షణ శిబిరాలు యూనియన్ రసేటి ముచ్చింతల్ యూనియన్ బ్యాంక్ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్  స్వర్ణభారత్ ట్రస్ట్ వారిచే సంయుక్తంగా గ్రామీణ యువతకు సీసీ కెమెరా, సెక్యూరిటీ అల్లారం స్మోక్ డిటెక్టర్, ఉచిత శిక్షణ, ఉచిత హాస్టల్ వసతి, ఉచిత భోజనం సౌకర్యం  యూనిఫారం, టూల్ కిడ్స్. ఇవ్వనున్నట్లు  మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, శిక్షణ సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది, వయసు 19 నుండి  45 సంవత్సరాలు, శిక్షణ 13 రోజులు ఉంటుందన్నారు, కావలసిన పత్రాలు 1.రేషన్ కార్డు జిరాక్స్. 2.ఆధార్ కార్డు జిరాక్స్. 3. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు. 4. 10 వ తరగతి సర్టిఫికెట్ జిరాక్స్. ఇవ్వగలరని తెలియజేశారు, 13 రోజుల శిక్షణ పూర్తి అయిన తర్వాత పరీక్షలు నిర్వహించి  సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది, ఈ యొక్క శిక్షణ శిబిరంలో మహేశ్వరం మండల యువకులు సద్వినియోగం చేసుకోవాలని, సీసీ కెమెరా నిపుణులకు చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కనుక యువత ముందుకు వచ్చి ఇలాంటి ఉచిత శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు, మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్.7382123670 ను సంప్రదించవలసిందిగా తెలిపారు.

Tags: