ఇంద్రేశంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ 

ఇంద్రేశంలో దూకుడు పెంచిన కాంగ్రెస్ 

​విశ్వంభర, సంగారెడ్డి : పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల రణక్షేత్రంలో ‘హస్తం’ పార్టీ దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  ముఖ్యంగా 6, 7, 8, 9, 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ​సోమవారం వీకర్ సెక్షన్ కాలనీలో నిర్వహించిన ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపించింది. 6వ వార్డు అభ్యర్థి ఐలాపురం నాగరాజు, 7వ వార్డు అభ్యర్థి రఘు నాయక్, 8వ వార్డు అభ్యర్థి బ్యాగరి మల్లేష్, 9వ వార్డు అభ్యర్థి కేతపల్లి స్వామి, 12వ వార్డు అభ్యర్థి ఐలాపురం అనిల్ కుమార్లు తమ మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కాలనీలోని ప్రతి గడపకూ వెళ్లి, పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ ముందుకు సాగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ​ఇంద్రేశంలో  అభ్యర్థులు సామాన్య ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.

Tags: