సదాశివపేటలో బీఆర్ఎస్ నిరసన 

సదాశివపేటలో బీఆర్ఎస్ నిరసన 

విశ్వంభర, సదాశివపేట: సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి   ముఖ్యమంత్రి కెసిఆర్ కు నోటీసులు ఇవ్వటాన్నివ్యతిరేకిస్తూ సదాశివపేట మండలంలోని  వెల్టూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.  గత రెండు సంవత్సరాలనుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మాజీ మంత్రులను విచారణ పేరుతో ఇబ్బందులకు గురి  చేస్తూ పార్టీ అధినాయకుడు కేసీఆర్ నోటీసులు పంపించి విచారణకు రమ్మనడం హేహమైన చర్యని ఖండించారు .  మున్ముందు ఇలాగే చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: