షంషీర్ గంజ్ శారదా విద్యాలయ ఆవరణలో ఫన్ మేలా
విశ్వంభర, షంషీర్ గంజ్/ అలియాబాద్:-104 సంవత్సరాల అతి ప్రాచీన విద్యాలయo గాను శారద విద్యాలయం పాతబస్తీలో పేరుగాంచింది, ఈ విద్యాలయంలో ప్రతి సంవత్సరం వైవిద్య భరితమైన ఆదరణగాంచిన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ పలువురిని ఆకట్టుకుంటుంది. అదే కోవలో ఈరోజు వీకెండ్ కార్యక్రమాన్ని ముగించుకొని పిల్లలను పెద్దలను ఆకర్షించే విధంగా మేళా నిర్వహించారు. పిల్లలకు ఆట వస్తువుల నుండి కాలక్షేపం చేసే బొమ్మల వరకు, ఆడపిల్లల కు డ్రెస్ మెటీరియల్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, ఫుడ్ స్టాల్స్, ఫ్రూట్ స్టాల్స్, మెడికల్ కు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మగవారికి అన్ని రకాల మెటీరియల్స్ వివిధ రకాల వైవిద్య భరితమైన 80 స్టాల్స్ వేసినట్టు ఈ కార్యక్రమానికి కాలేజి లో ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో విజయవంతం చేసినట్టు డిగ్రీ అండ్ పీజీ ప్రిన్సిపల్ సాంబ లలిత తెలిపారు. పలువురు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ కాలేజీ తరఫున జరగాలని పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేయడంవల్ల ఫోన్లో పై దృష్టి మరలదలని చెప్పుకొచ్చారు, ఇంతటి జనాధారణ పొందడం చాలా సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.



