ఎన్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో యోగ అవగాహన కార్యక్రమం
విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని (స్వయంప్రతిపత్తి), ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగాఅంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 సంవత్సరం ఎన్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యోగా పట్ల అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగ అధ్యాపకురాలు డా. కె. సుమలత యోగా శిక్షకురాలిగా వ్యవహరించి విద్యార్థులు మరియు సిబ్బందికి వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు . ఈ సందర్భంగా కార్యక్రమమును ఉద్దేశించి డా. సుమలత మాట్లాడుతూ యోగా , అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని , నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు శారీరక దృఢత్వం, ఏకాగ్రత మరియు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు .ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బి. శ్రీనివాస్ అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 యొక్క ప్రధాన ఇతివృత్తమైన Healthy Ageing through Yoga (యోగాతో ఆరోగ్యవంతమైన వృద్ధాప్యం) గురించి విద్యార్థులు, అధ్యాపకులకు సందేశం అందించారు. యోగా సాధన అన్ని వయసుల వారికి ఉపయోగకరమని, ముఖ్యంగా వృద్ధాప్యంలో శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు పాల్గొన్న వారందరికీ కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపింది .