మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవం - * విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసిన శంకర్
On
విశ్వంభర, వనస్థలిపురం: చిన్నారులు ఎదగడానికి వారి హక్కులు ఎంతో ముఖ్యమైనవని మదర్ థెరిసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకర్ అన్నారు. భావవ్యక్తీకరణ, చదువు, స్వేచ్ఛ, హక్కులను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని వనస్థలిపురం జడ్పీహెచ్ఎస్ లో సొసైటీ ఆధ్వర్యంలో జరిపారు. ఆరో తరగతి పిల్లలకు రైట్స్ గురించి బోధించారు. వారికి బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు దుర్గాలత, టీచర్లు నాగార్జున, లక్ష్మి, సామాజిక కార్యకర్తలు బాలరాజు, తదితరులు ఉన్నారు.



