శంకర్ స్వామి గుట్టపై  సెంట్రల్ లైటింగ్ పనులు 

శంకర్ స్వామి గుట్టపై  సెంట్రల్ లైటింగ్ పనులు 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని శంకర్ స్వామి గుట్ట పైన పల్లపు అశోక్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ పనులను గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రమ్  ప్రారంభించారు. శంకర గుట్టకు వెళ్లే రోడ్డు వెంట ఉన్న చెట్లను తొలిగించారు. మిగతా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు మెంబర్లు, మార్కెట్ డైరెక్టర్ పెద్దగోని వెంకటేశం, ఇతర గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: