జాతీయ చేనేత అవార్డు గ్రహీత ఆనందం నాగరాజు కు దక్కిన అవకాశం

 ఢిల్లీ సూరజ్ కుండా మేళ ఎగ్జిబిషన్ లో తెలంగాణ చేనేత వస్త్రాలు 

జాతీయ చేనేత అవార్డు గ్రహీత ఆనందం నాగరాజు కు దక్కిన అవకాశం

విశ్వంభర, న్యూఢిల్లీ :- కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించిన సూరజ్ కుండా మేళ ఎగ్జిబిషన్ లో తెలంగాణకు చెందిన ఉమ్మడి నల్లగొండ జిల్లా  పుట్టపాక గ్రామవాసి  జాతీయ చేనేత అవార్డు గ్రహీత ఆనందం నాగరాజు తయారు చేసిన తెలియా రుమాల్ చీరలు, చున్నీలు , డబల్ ఇక్కత్ చీరలు,  చున్నీలు డాబీ బోను చీరలు ప్రదర్శనలో చేనేత వస్త్రాలను స్టాల్ల్స్ లో ఏర్పాటు చేశారు. పదిహేను రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబందించిన వస్త్రాలను ప్రదర్శనలో పెట్టారు. ఈ ప్రదర్శనకు వివిధ దేశాల నుండే కాక దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. చేతివృత్తుల నైపుణ్యంతో తయారు చేసిన ఈ వస్త్రాలకు మంచి ఆదరణ ఉంటుందని నాగరాజు విశ్వంభర న్యూస్కు తెలిపారు. 

Tags: