స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం 

స్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం 

 విశ్వంభర, చంద్రాయన గుట్ట : చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని నల్లవాగు హిందూ స్మశాన వాటిక లో చంద్రాయన గుట్ట కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్, కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్  కలిసి కాంపౌండ్ వాల్ జాలి పనులు, బావి పై జాలి  పనులకు   ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా  నాగేష్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈరోజు కాంపౌండ్ వాల్ జాలి పనులు,పలు అభివృద్ధి పనుల కు శంకుస్థాపన చేసామని చెప్పారు.  దీనికి స్పందించి నిధులు మంజూరు చేసిన జిహెచ్ఎంసి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాగరి సంఘం ప్రెసిడెంట్ సాయినాథ్, జనరల్ సెక్రెటరీ వీరేందర్, రొడ్డ జయలక్ష్మి రోడ్డ అమర్ కుమార్,సత్యమ్మ, ప్రదీప్ కుమార్,సురేందర్లు పాల్గొన్నారు.

Tags: