మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయండి
- జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్
విశ్వంభర, ఇనుగుర్తి: మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేసి, కాటాలు నిర్వహించి,గోదాములకు తరలించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ సంబంధిత అధికారులను చరవాణిలో ఆదేశించారు. మండల కేంద్రం ఇనుగుర్తి లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను హుస్సేన్ నాయక్ అడిగి తెలుసుకున్నారు. 45 రోజులుగా జొన్నలు కొనుగోలు కేంద్రంలో పోసి అవస్థలు పడుతున్నామని కర్షకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడారు. అకాల వర్షాలు ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియని పరిస్థితి నెలకొని ఉందని,మొక్కజొన్న రైతుల సమస్యను కొనుగోలు చేసి పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లామండల అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు, దుంపల సందీప్, డా.పోలేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.