చెన్నూరుకు బస్సులు  నడపాలి 

చెన్నూరుకు బస్సులు  నడపాలి 

విశ్వంభర ,  మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం నుంచి పలుగుల, మద్దులపల్లి, చండ్రుపల్లి, అన్నారం మీదుగా చెన్నూరుకు ప్రతిరోజూ మూడు ట్రిప్పుల ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు. ఈ మేరకు వారు మంచిర్యాల జిల్లా ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలతను కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం అత్యంత అవసరమని, విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత సానుకూలంగా స్పందిస్తూ, విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సర్పంచులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలుగుల సర్పంచి విజయలక్ష్మి, మద్దులపల్లి సర్పంచి సరిత, చండ్రుపల్లి సర్పంచి గురుసింగ బాపు, అన్నారం సర్పంచి ప్రభాకర్ పాల్గొన్నారు.

Tags: