క్రిష్ణవేణీ పాఠశాలలో  స్వపరిపాలన దినోత్సవం   

క్రిష్ణవేణీ పాఠశాలలో  స్వపరిపాలన దినోత్సవం   

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాద్యాయులుగా, అధికారులుగా వివిధ పాత్రలు పోషించి అందరిని ఆకట్టుకున్నారు. ఉపాద్యాయుల పాత్రలో తరగతి గదులలో తమ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ గా రింషా సదాఫ్, డిప్యూటీ కలెక్టర్ గా కె.గీతాంజలి, డిఈవోగా ఉమేమా బుస్రా, డిప్యూటీ డిఈవోగా అంతుల్ హాది, ఎండిఓ గా బి.ప్రతీక్ చారి, తహసిల్దారుగా ఎన్.జస్వంత్, కరెస్పాండెంట్ గా ఎం.రిషిత, ప్రిన్సిపాల్ గా బి.చైత్ర తమ పాత్రలను పోషించారు. అనంతరం జరిగిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జెవిఎన్ఎస్ మణి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు రషీద్, మురళి, శ్రీనివాస్, మల్లేష్, అలీం, సత్తయ్య, ఉమారాణి, మహాలక్ష్మి, పూనం దాస్, వినోద, లావణ్య, ఫారియా, విజయలక్ష్మి, కరుణ, కళ్యాణి, శ్వేత, మమత, శ్రీలత, సంధ్య, మాధవి, ఎస్.ఉమారాణి, టి.లావణ్య, రేణుక, కవిత, అనూష, నజియా, సరిత, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

Tags: