హైకోర్టు న్యాయమూర్థులకు  ఘన స్వాగతం  

హైకోర్టు న్యాయమూర్థులకు  ఘన స్వాగతం  

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో నూతన కోర్టు భవనాల శంకుస్థాపన కార్యక్రమం అనంతరం హైకోర్టు న్యాయ మూర్తులు, వారిలో ఒకరైన జస్టిస్ కూనూరు లక్ష్మణ్ స్వగ్రామం రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి విచ్చేయగా గ్రామస్తులు  గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో  బొకేలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు  శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు  కూనురు లక్ష్మణ్, పి.శ్యామ్ కోసి, కే.శరత్ లు మాట్లాడుతూ, పచ్చదనం పరిశుభ్రత ఎంతో ముఖ్యమని,  ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, గ్రామాలను పరిశుభ్రతగా ఉంచాలని, మొక్కలు నాటడం ద్వారా మానవాళికి ప్రాణవాయువు అందిస్తుందని, భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. వర్షాలు పడాలన్నా, పాడిపంటలు పండాలన్నా ప్రకృతిలో మొక్కలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయని, గ్రామ ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనిచెప్పారు. ఈ  సందర్బంగా  హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయసేనారెడ్డి, జస్టిస్ సృజన, జస్టిస్ కళాసికం, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా ఎస్పీ అఖిలేష్ యాదవ్, సీనియర్ సివిల్ జడ్జి సబితా, జూనియర్ సివిల్ జడ్జి శిరీష లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నూతన పాలకమండలి, గ్రామ ఉప-సర్పంచ్ బైకాని ఉమ మహేష్ యాదవ్, వార్డు మెంబర్లు, గోగు ప్రమీల రమేష్ యాదవ్, కనుకు మల్లేశం, మేడి దేవి ఆంజనేయులు, నేరటి మానస సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్ యాదవ్, చిరగోని శిల్పా నవీన్ యాదవ్, వనం ఆండాలు యాదగిరి, భోగ సహదేవ్, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, గ్రామ పెద్దలు,  తదితరులు పాల్గొన్నారు.

Tags: