బ్రేకింగ్ న్యూస్ - భయభ్రాంతులకు గురైన పేషంట్

బ్రేకింగ్ న్యూస్ - భయభ్రాంతులకు గురైన పేషంట్

విశ్వంభర,హనుమకొండ:- విజయ డయాగ్నోస్టిక్ లో దారుణం చోటుచేసుకుంది. హుజురాబాద్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి(40) క్రియాటిన్ టెస్ట్ కోసం డయగ్నోస్టిక్  లో శాంపిల్ ఇచ్చారు.. ఈ నేపథ్యంలో  క్రియాటిన్ రిపోర్టులో.5.7 అని రాగా భయభ్రాంతులకు గురైన పేషంట్.. మరొక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ ను  సంప్రదించగా అదే టెస్టును మళ్లీ చేయగా..1.6 వచ్చిందని అన్నారు. దీంతో డయాగ్నొస్టిక్ ఎదుట పేషంట్ ఆందోళన చేపట్టారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటా హుటిన విజయ డయాగ్నస్ సెంటర్ ను సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

Tags: