వి.ఎం.ఎఫ్ క్యాంపునకు అల్పాహారం వితరణ
విశ్వంభర, ఇనుగుర్తి: వేసవి శిక్షణ తరగతుల శిబిరంలోని బాలికలకు అల్పాహారం వితరణ కు బిజెపి మండల అధ్యక్షులు దుంపల సందీప్ ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నాడు. మండల కేంద్రం ఇనుగుర్తి హై స్కూల్ లో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల బాల బాలికలకు శుక్రవారం సందీప్ వితరణ చేసిన అల్పాహారాన్ని విద్యాభివృద్ధి కమిటీ అధ్యక్షులు దార్ల రామ్మూర్తి,దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయం.సందీప్ మాట్లాడుతూ వేసవిలో విద్యా మెలకువలు తెలుసుకోవడానికి శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ కు అల్పాహారం అందజేయడం తనకు సంతృప్తిమిస్తుందన్నారు. కార్యక్రమంలో బేతమల్ల చంద్రయ్య, పొన్నం కవిత, వాలంటీర్లు కొంతం స్వప్న, కుంచాల నిర్మల తదితరులు పాల్గొన్నారు.