భవన నిర్మాణానికి భూమి పూజ   

భవన నిర్మాణానికి భూమి పూజ   

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలో బుధవారం  అంగన్వాడి కేంద్రం, ఆరోగ్య ఉప-కేంద్రం నిర్మాణానికి సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యం.జ్యోతి, ఆరోగ్య ఉప-కేంద్రం స్థల దాత రాపోలు నర్సయ్య, వార్డు సభ్యులు జెల్లా సూర్యకళా శ్రీనాథం, గాదే శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేశం, పగుడాల లక్ష్మి, మోటే స్వామి, కంకల అర్చన మల్లేశం, కట్ట భానుశ్రీ, సతీష్ రెడ్డి, గాదే యాదగిరి, సంగిశెట్టి మహేష్, అంగన్వాడి టీచర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: