సర్పంచులకు సన్మానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులను రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బసు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే రోజులలో రామన్నపేట అసెంబ్లీ కేంద్రంగా కావాలని, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు పూర్తిగా మద్దతు ఇవ్వాలని, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో తీర్మానం చేసి పంపాలని, మండల పరిషత్ సమావేశంలో కూడా ఉద్యమాలు ఎక్కువ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ మండల అధ్యక్షులు గడ్డం యాదగిరి, టిడిపి మండల అధ్యక్షులు ఎండి ఫజల్, కాంగ్రెస్ మండల నాయకులు కూనూరు కృష్ణ గౌడ్, బీఎస్పీ మండల అధ్యక్షులు నగరికంటి నరేష్, సిపిఐ మండల నాయకులు రామోజీ నరసింహచారి, పెండెం రవీందర్, గంగాపురం వెంకటయ్య, ఎండి ఇమామ్ సాహెబ్, పోలగోని నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.



